ఢిల్లీ నార్త్ బ్లాక్ లో అసలు ఏం జరుగుతుంది?

February 22, 2016 | 05:08 PM | 1 Views
ప్రింట్ కామెంట్
northblock-budget-making-secretly-niharonline

మోదీ నేతృత్వంలోని ఎన్టీయే ప్రభుత్వం 2016-17 గానూ బడ్జెట్ కి సిద్ధపడిపోతుంది. ఏటా కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రజాపద్దులపై సామాన్య జనాలకే ఎక్కువ ఆసక్తి ఉంటుందన్నది తెలిసిందే. ఎందుకంటే వారి జీవితాలనే బడ్జెట్ ఎక్కువగా ప్రభావితం చేస్తుంది గనక. ఇక దేశం మొత్తం ఆసక్తిగా బడ్జెట్‌ రూపకల్పన అసలు ఎలా జరుగుతుంది అనేది చాలా మంది మదిలో మెదిలే ప్రశ్నే. అయితే ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ణానాన్ని అనుసరించి ఆన్ లైన్ తో బడ్జెట్ రూపొందిస్తారని అంతా అనుకుంటే అది పెద్ద పొరపాటే.

అత్యంత రహస్యంగా బడ్జెట్ ను రూపొందిస్తాయి మన ప్రభుత్వాలు. న్యూఢిల్లీ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ లోని నార్త్‌ బ్లాక్‌ బేస్‌మెంట్‌ లో ఉన్న ముద్రణా కార్యాలయంలో ఎంపిక చేసిన కొందరు అత్యంత నమ్మకమైన అధికారుల నేతత్వంలోనే ఇది రెడీ అవుతుంది. ఇక అన్ని నెట్‌ వర్క్‌ లింకులూ తొలగించబడ్డ కంప్యూటర్లపైనే పని సాగుతోంది. అన్ని ప్రతిపాదనలతో కూడిన బడ్జెట్‌ సీడీ బడ్జెట్ కు ఒక్క రోజు ముందుగా గానీ, లేక కొద్ది గంటల ముందుగా కానీ ముద్రణ అవుతుంది.

ఇక ప్రింటింగ్‌ పనిలో నిమగ్నమైవున్న అందరు సాంకేతిక అధికారులు, లీగల్‌ అధికారులు, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో అధికారులు, నార్త్‌ బ్లాక్‌ లో పనిచేసే అధికారులు, ఇతర సిబ్బంది అంతా ఎవరూ బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా కట్టడి చేస్తారు. పనంతా పూర్తయ్యేదాకా వారికి అక్కడే తిని, అక్కడే నిద్ర. వారి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాటానికి కూడా వీల్లేకుండా వీరికి మొబైల్ ఫోన్లను లేకుండా చేస్తారు. ఇక బడ్జెట్ పుస్తకాల ముద్రణ పూర్తయిన తరువాత వాటిని అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉంచుతారు. మంత్రివర్గ సహచరులకు ఈ బడ్జెట్‌ ప్రతులు కేవలం 10 నిమిషాల ముందు మాత్రమే అందుతాయి. ఆర్థికమంత్రి లోక్‌ సభ లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరమే వీరంతా బయటకు వస్తారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ