నాయుడిగారి నాలుకకు ఎన్ని మెలికలో!

March 19, 2015 | 04:01 PM | 98 Views
ప్రింట్ కామెంట్
venkaiah_naidu_ap_special_status_niharonline

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రోజుకో మాట మారుస్తూనే ఉన్నారు. ఓసారి కంపల్సరీ అంటారు. ఓసారి ప్యాకేజీతో సరిపెట్టుకుంటే చాలంటారు. ఇలా పూటకో మాట మారస్తూ సొంత పార్టీ నేతల్లోనే చులకన అయిపోతున్నారు . తాజాగా ఎట్టి పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా రావాల్సిందేనని అంటున్నారు ముప్పవరపు వెంకయ్య నాయుడుగారు. పైగా ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీదే ద్వంద్వ వైఖరి అని ఆయన ఆరోపిస్తున్నారు. కేంద్రమంత్రి రాజ్ నాథ్ తో, ఏపీ బీజేపీ నేతలతో కలిసి సమావేశమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం తామూ క్రుషిచేస్తున్నామని ఆయన అన్నారు. అంతేకాదు ఏపీ సమస్యల పరిష్కారానికి హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రత్యేక చోరవ తీసుకుంటున్నారని ఆయన అంటున్నారు. ఎంత వాక్ చాతుర్యం ఉన్నంత మాత్రనా మరీ ఇంత దారుణంగా రోజూకో మాట మార్చటం ఏంటి నాయుడు గారూ... కేంద్రంలో అధికారంలో ఉంది మీరేగా, మరి అలాంటి అంశాన్ని అసలే చచ్చిన పాము లాంటి కాంగ్రెస్ మీద నెట్టడం ఎంతవరకు సమంజసం చెప్పండి మంత్రివర్యా?

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ