హోదా... ఒక బ్రహ్మ పదార్థం

August 29, 2015 | 02:51 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Venkaiah_naidu_AP_apecial_status_people_died_niharonline.jpg

మాటకారి వెంకయ్య... మీడియా మిత్రుడు. పేజీలు నింపటంలో తనవంతు కంట్రిబ్యూషన్ ఇంచుమించు రోజువారీ వడ్డించడంలో ఉడుతా భక్తిగా తోడ్పడే వయ్యాకరణి. హోదా కోసం తీవ్రమైన నిర్ణయాలు తగదని హితవు పలికిన ధీశాలి. హోదా అనే పదం అవశేష ఆంధ్రులకు తలకి బాగా ఎక్కించడంలో నాయుడి గారి పాత్ర ఉందని తెలుసు. పర్యవసానంగా తిరుపతిలో ముని ఆత్మార్ఫణంతో మొదలై నెల్లూరులో లక్ష్మయ్య, గుడివాడలో ఉదయభాను, కర్నూలు జిల్లాలో లోకేశ్వర్రావు, విశాఖ జిల్లాలో దేముడునాయుడులు బలయిపోయారు.

అవకాశాన్ని అందిపుచ్చుకున్న ప్రతిపక్ష రామచంద్రయ్య జయప్రకాశ్ నారాయణ ప్రభృతులు తమ వ్యాఖ్యానాలతో అలరించడానికి గాలిలో కలిసిపోయి నిష్ప్రయోజనం అయిపోతే ఎంత దు:ఖ భోజనం అది. వెంకయ్య తీవ్ర నిర్ణయాలు వద్దు అని ప్రవచించడంతో సరిపోదు. హోదా విషయంలో శసభిషలు లేకుండా సూటిగా మర్మం లేకుండా ప్రజలను ఎడ్యుకేటు చేసి పూర్వాపరాలు వివరించి దేనివలన ఎంత ప్రయోజనమో విశదపరచి ఆత్మహత్యల పరంపరకు అడ్డుకట్ట వేసేందుకు నిజాయితీగా ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో అడ్డుపంచె వెంకయ్య సూటు బూటు మోదీగారు స్పందించి తీవ్రమైన నిర్ణయం తీసుకోగలిగితే కుటుంబాలు రోడ్డున పడవు. మీ ప్రాణాలూ,  పోతున్న ప్రాణాలు విలువ ఒక్కటే అనుకోని పంచె బిగించండి. మాటలు కాదు.. చేతలు కావాలి... అర్జెంటు!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ