రాములక్కా... ఈ రాజ్యం ఏంది? రాజ్యహింస ఏంది?

September 16, 2015 | 05:13 PM | 2 Views
ప్రింట్ కామెంట్
vijaya-shanthi-kcr-warangal-encounter-niharonline.jpg

రంగు రంగుల వెండితెర ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయిన వారు చాలా తక్కువే. తమ ఫ్యాన్స్ తమను తప్పక ఆదరిస్తారని వచ్చి భంగపాటు పడిన వారు ఎంతో మంది. ఆనక పరిస్థితి అర్థం చేసుకుని గప్ చుప్ అయిపోయే వారు కొంతమంది ఐతే. తిరిగి తెరపై అయినా ఆదరణ దొరక్క పోదా అని తిరగొచ్చేవారు కొందరు. అలాంటి వారిలో విజయశాంతి ఒకరు. కానీ, ఆమె పరిస్థితి ఇప్పుడు ఏంటీ?

ఒకానొక దశలో ఆమె రాజకీయ ప్రస్థానం బాగానే సాగింది. తొలుత భాజపానుంచి తెరాసలోకి గెంతినా అక్కడ మంచి అవకాశాలే అందుకుంది. ఎంపీ అయింది. ఒక వెలుగు వెలిగింది. అయితే తెలంగాణ కల సాకారం అయ్యే వేళ ఆమె తీసుకున్న నిర్ణయం మొత్తానికి దెబ్బ తీసింది. కేసీఆర్‌ లూప్‌లైన్లోకి నెడతాడని అనుమానం రాగానే.. అక్కడినుంచి కాంగ్రెసులోకి వెళ్లిపోయింది. తెలంగాణ ఇస్తున్నది కాంగ్రెస్ గనుక.. ఆ పార్టీకి తిరుగు ఉండదని అనుకుంది. పాపం ఫలితం ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఆ తర్వాత ఎప్పుడూ సీన్లోకి రాలేదు. ఆ మధ్య మళ్లీ సినిమాల్లోకి రావాలని ఉంది అంటూ మీడియా ముందుకొచ్చి మొఖం చూపిందే తప్ప. మళ్లీ రాములక్క జాడలేదు. అయితే ఇప్పుడు సడన్ గా మళ్లీ వచ్చేసిందండోయ్..

వరంగల్ ఎన్ కౌంటర్ పై స్పందించిన ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. మావోయిస్టుల ఎజెండానే తమ ఎజెండా అని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ అధికారాన్ని చేపట్టాక బూటకపు ఎన్ కౌంటర్ లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నా పరిస్థితిలో ఏ మార్పు రాలేదని అన్నారు. కేవలం రాజ్యం మారిందే కానీ, రాజ్య హింజ ఆగలేదని దుయ్యబట్టారు. ఈ కన్య్ఫూజన్ ఎందుకు? రాజకీయమో, రంగుల ప్రపంచమో ఏదో ఒకటి ఫిక్సయితే బెటర్ కదా ... రెండు పడవల మీద ప్రయాణం కష్టమే కదా అక్కా!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ