జగన్ చరిత్ర తవ్విన బెజవాడ ఎమ్మెల్యే

March 14, 2016 | 04:19 PM | 3 Views
ప్రింట్ కామెంట్
bonda-umamaheswar-rao-assembly-jagan-niharonline

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార పక్షంపై ప్రతిపక్షం ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న చర్చలో మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ప్రత్యేకించి మంత్రులతో సహా టీడీపీ సభ్యులంతా జగన్ పై ముప్పేట దాడి ప్రారంభించారు. అసలు జనాలకు తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఇష్టం లేదని, అవిశాస్వం వీగుతుందని తెలిసి జనాలకు ఈ ప్రభుత్వం చేసే మోసాలు వివరించేందుకు ముందుకు వచ్చామని జగన్ అసెంబ్లీలో మాట్లాడాడు. అయితే ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తన ప్రసంగంలో జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాట్లాడితే తమ అధినేత చంద్రబాబు నాయుడు నేరస్థుడు అంటున్న జగన్ ది మొదటి నుంచి నేర చరిత్రేనని బొండా ఆరోపించారు.

                ఈ సందర్భంగా గతంలో జరిగిన విషయాలంటూ ఆయన ఆధారాలు కూడా చూపటం విశేషం. కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ పై 22 ఏళ్ల వయసులోనే దాడి చేసిన జగన్,  అక్కడి పోలీసులపై చేయి చేసుకున్నారని, దానికి జగన్ పై కేసులు కూడా నమోదయ్యాయని ఆయన చెప్పారు. అంతేకాకుండా సదరు ఘటనకు సంబంధించి ఆధారాలను కూడా ఆయన ప్రదర్శించారు. ఇక మొన్న తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన కాపు ఐక్య గర్జనలో జరిగిన విధ్వంసానికి జగన్ ఇలాకా పులివెందుల నుంచి వచ్చిన రౌడీలే కారణమంటూ ఇంటలిజెన్స్ రిపోర్టులు నివేదిక ఇచ్చాయని, దానిపై ఇంకా స్పష్టత వస్తే అసలు రంగు బయటపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే బొండా ప్రసంగించే టైంలో జగన్ ముసి ముసి నవ్వులు నవ్వటం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ