కొత్త చట్టంతో ఆరెస్సెస్ చీఫ్ జైల్లో పడతాడా?

May 07, 2016 | 05:50 PM | 1 Views
ప్రింట్ కామెంట్
RSS-chief-mohan-bagath-map-trouble-niharonline

భారతదేశ మ్యాపులో మార్పులు చేర్పులు చేసిన, తప్పుగా చూపించినా గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్షతోపాటు, కోటి రూపాయల నుంచి వంద కోట్ల రూపాయల వరకు జరిమానా విధించే చట్టాన్ని చేసేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. ఇటీవల జమ్ముకశ్మీర్ ను పాకిస్థాన్ లో, అరుణాచల్ ప్రదేశ్ ను చైనాలో కలిపినట్టు భారతదేశ మ్యాప్ ఒకటి సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో మోదీ ప్రభుత్వం కొత్త ముసాయిదా బిల్లును రూపొందించింది. ఈ బిల్లు ప్రకారం భారతదేశ మ్యాపును ఎవరైనా మార్చి చూపిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని తెలుస్తోంది.

                 అయితే ఈ కొత్త చట్టంతో బీజేపీ మిత్ర పక్షం ఆరెస్సెస్ కు కూడా చిక్కులు తప్పేలా లేవు. ఎందుకంటే... పాకిస్ధాన్, బంగ్లాదేశ్ లు భారతదేశంలో అంతర్భాగాలుగా ఉన్న మ్యాపును ఆర్ఎస్ఎస్ తన అధికారిక మ్యాప్ గా పేర్కొంటుంది. ఇంకొన్ని మ్యాపుల్లో ఆఫ్ఘనిస్థాన్, మయన్మార్, శ్రీలంక, నేపాల్ దేశాలను కూడా భారత దేశంలో చూపిస్తుంది. మరి ఈ లెక్క ప్రకారం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ మోదీ ప్రభుత్వం శిక్షిస్తుందా అంటూ? అంటూ సోషల్ మీడియాలో చర్చలతో పాటు, ఫోటోలు షేర్ అవుతున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ